అయితే పిల్లల్లో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ఉపయోగించే అలవాటు పెరిగి పోతుంది. చిన్నప్పటి నుండి పిల్లలకు సోషల్ మీడియా బాగా అలవాటు ఐపోయింది. ఇక చదువు, నిద్ర కూడా మానేసి మరీ స్క్రీన్ కు అతుక్కుపోతుంటారు. ఇలా వాటితో గడిపే సమయం పెరిగిపోవడం నిద్రలేమి కి ప్రధాన కారణమని యూరోపియన్ పరిశోధకులు తెలిపారు . 278 మంది పిల్లలతో జరిగిన అధ్యయనంలో రాత్రి సమయంలో స్క్రీన్ ఉపయోగించే పిల్లల్లో నిద్రలేమి అవకాశాలు ఎక్కువని నిద్ర నాణ్యత తక్కువని తేలింది. ఈ కారణంగా పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇవ్వడం తగ్గిస్తే మంచిది.
ఇక కొంత మంది తల్లిదండ్రులు, పిల్లలు కొంచెం పెద్దయ్యాక వారికి ప్రత్యేకమైన పడక గది కేటాయిస్తారు. కానీ పిల్లలు తల్లిదండ్రులతో పాటుగా నిద్ర పోవడమే మంచిదని పలు పరిశోధనలు రుజువు చేసాయి. పిల్లల్లో ఆహారపు అలవాట్లు నిద్ర పై ప్రభావం చూపిస్తున్నాయని గ్రీక్ లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. 8 నుంచి 17 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 177,091 మంది పిల్లలతో జరిపిన అధ్యయనం ఇది. రోజూ స్వీట్లు తినడం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం, త్వరగా తినడం, లాంటివి వారి నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు కనుగొన్నారు. కాబట్టి కొంచెం కఠినం అయినా కూడా పిల్లలు రోజు ఒకే సమయానికి మీ దగ్గరే పడుకునేలా ఏర్పాటు చేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి