వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు తరచూ సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల వల్ల ఎంతో ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని.. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు ముఖ్యంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెద్దల కంటే బలహీనంగా ఉంటున్నందున ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు,

చిన్న పిల్లలో ఎక్కువగా సీజనల్ వ్యాధులకు గురవుతుంటారు. సీజనల్ వచ్చే ఫ్లూలలో ఎక్కువగా జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, ఎసిడిటీ, చెవిపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీజనల్ ఫ్లూ రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతుంటే అతనికి తిరిగి ఫ్లూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే సీజనల్‌ ఫ్లూ సమయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరల్ మయోకార్డియా దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. సీజనల్‌లో వచ్చే ఫ్లూ వైరస్ వల్ల ఇది కుంటిని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఫ్లూ సమయంలో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూలో ఇటువంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించినప్పుడు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కువగా వృద్ధులలో సంభవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సీజనల్‌ ఫ్లూ సమయంలో క్యాన్సర్ వంటి ఏదైనా తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజనల్ ఫ్లూ వారి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీని వలన వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. సీజనల్ ఫ్లూ చాలా తీవ్రతరం అయిన లేదా ఇప్పటికే ఆటో-ఇమ్యూన్ డిజార్డర్ వంటి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల మెదడులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: