ఈ రోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం, పొట్ట తగ్గడం అన్నవి పెద్ద సమస్యలవుతున్నాయి. ఐతే.. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం మన బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు ఇందులోని ఫ్లైవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయాలి. ఇందులో ఫైబర్‌ తోపాటు... ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనా యాసిడ్లు ఉంటాయి. 


చెరుకు రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 220 గ్రాముల చెరుకు రసంలో... 180 కేలరీల శక్తి ఉంటుంది. పంచదార 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో అనవసరంగా ఉండే LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్స్‌ని కరిగిస్తుంది. వీటి వల్లే మనం బరువు పెరుగుతూ ఉంటాం. ఇవి మన శరీరంలో పెరిగే కొద్దీ... గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి... ఈ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాల్సిందే.


చెరుకు రసంలోని ఫైబర్ (పీచు పదార్థం)... కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్ అంతు చూస్తుంది. రోజూ గ్లాస్ చెరుకు రసం తాగితే... మన శరీరాన్ని అది ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తుంది. అనవసర వ్యర్థాల్ని బయటకు పంపేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ వల్ల బరువు తగ్గిపోతారు. పొట్ట చుట్టూ ఉండే రింగు లాంటి కొవ్వు కూడా తగ్గిపోతుంది.


చెరుకు రసం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. మన కిడ్నీలు, లివర్ బాగా పనిచేస్తాయి. చాలా రోగాలు నయమవుతాయి. కాన్సర్, జాండీస్ లాంటివి కూడా తగ్గుతాయి. చెరుకు రసంలోని పొటాషియం... మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.చెరుకు రసంలోని గ్లిసెమిక్ ఇండెక్స్... మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా కొద్ది మొత్తంలో చెరుకు రసం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. చెరుకు రసం ముసలి తనం రాకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, మచ్చల్ని తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు కూడా చక్కగా ఉంటాయి. ఐతే... రోజుకు ఒక గ్లాస్ మాత్రమే తాగితే మంచిది. తియ్యగా ఉంటుంది కదా అని ఎక్కువ చెరుకు రసం తాగితే... అందులో షుగర్ వల్ల... బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: