పీవీ నరసింహారావు.. తెలుగుతేజం.. గ్రామ సర్పంచ్ నుంచి భారత ప్రధాని వరకూ ఆయన ఎన్నో పీఠాలు అధిరోహించారు. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తనంత తానుగా ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. ఇది మొదటి పాఠం.

 

 

రెండోది ఆయన ఎప్పుడూ ఆయన నేర్చుకోవడం ఆపలేదు. ఆయన 14 భాషలు నేర్చుకున్నారు. అంతే కాదు. జీవిత చరమాంకంలో ఆయన కంప్యూటర్ కోడింగ్ కూడా నేర్చుకున్నారు. అందుకే నేర్చుకోవడం ఆపొద్దు. ఇది రెండో పాఠం.

 

 

మరో కీలకమైన పాఠం.. సమస్యను సమస్యగా చూడు. అందులో నీ స్వార్థం గురించి ఆలోచన రానీయకు. అవును. ఆయన స్వతహాగా వందల ఎకరాల భూములు ఉన్న జమీందారీ కుటుంబీకుడు అయినా కఠినంగా భూసంస్కరణలు అమలు చేశారు. స్వయంగా తన భూములు ప్రభుత్వానికి అప్పగించారు.

 

 

మరో పాఠం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు.. ఫలితం ఆశించొద్దు. పీవీ అలాగే తన ముందున్న పనులు చేసుకుంటూ వెళ్లారు. ఆయనకు జీవిత చరమాంకంలో దేశ ప్రధాని అయ్యే అవకాశం తనంతతానే వచ్చి వళ్లో వాలింది. దానికీ ఆయన న్యాయం చేశారు. ఇవీ పీవీ నుంచి మనం నేర్చుకునే పాఠాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: