సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గంట మాత్రమే వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరం ఒక సాధారణ శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది.. ఈ గంట పాటు శక్తి మీరు ముందు రోజు తీసుకున్న ఆహారం శక్తి రూపంలో కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఇలా నిల్వ చేయబడిన గ్లూకోజ్ నిల్వలు మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో శక్తి లాగా ఉపయోగపడతాయి.
ఖాళీకడుపుతో చేసే వ్యాయామం వల్ల కలిగే ఉపయోగాలు మీద ఇటీవల బ్రిటన్ లోని నార్త్ అంబ్రియా యూనివర్సిటీ వారు ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. పరగడుపుతో వ్యాయామం చేసిన వారిలో ముందురోజు నిల్వ ఉన్న చక్కెర నిల్వలు, శక్తిని సమకూర్చిన్నట్టు తేలింది. అంతే కాకుండా వీరు అవసరానికి మించి ఆహారం తీసుకోకుండా ఉన్నారట. అంతేకాదు ఖాళీకడుపుతో ఎవరైతే వ్యాయామం చేస్తారో, వారి శరీరంలో 20 శాతం కంటే ఎక్కువ కేలరీలు కూడా ఖర్చు అయ్యాయట.
దీన్ని బట్టి చూస్తే ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు అని తెలుస్తోంది. కాబట్టి ఎవరైతే బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారో, అలాంటి వారు ఉదయం ఖాళీ కడుపున ఒక గంట పాటు వ్యాయామం చేస్తే ,అధిక కేలరీలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి