
కానీ, వీలుకానప్పుడు కాదని చెప్పడం ఉత్తమం. అతి మొహమాట పడి, అవతలి వాళ్లు ఏం అనుకుంటారు అని ఇష్టం లేని పనిని చెయ్యటం లేదా వాళ్ల పని మీరు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చెప్పింది ఏదైనా అది నీ సొంత పని, సమయాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. పదేపదే ఇలాంటివి జరిగితే సున్నితంగా చెయ్యలేనని చెప్పడం మంచిది.
మొహమాటానికి పోయే అవతలి వారు చెప్పిన ఏదో ఒక పని చేసి, తరువాత తీరిగ్గా కూర్చుని దాని గురించి బాధపడటం లాంటిది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఇది మాత్రం మంచిది కాదు. ఇది మీ శక్తిని, సమయాన్ని వృధా చేస్తుంది. ఈ మొహమాటం నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇతరులు ఏమనుకుంటారా అనే ఆలోచనతో వారు చెప్పింల్లా చేస్తుంటారు. వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏ వ్యక్తి అయితే తన విలువల గురించి స్పష్టంగా తెలుసుకుంటాదో అతను ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడు. మొహమాట పడుతూ స్పష్టత లేకుండా ఇతరుల పనిని చేస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.