
1 టీస్పూన్ జీలకర్రను 1 గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వేడి చేసి తాగాలి.నిమ్మ + తేనె నీరు,లెమన్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉండి, ఫ్యాట్ కట్ చేసే శక్తిని పెంచుతాయి. తేనెతో కలిపితే మెటాబోలిజం స్పీడ్ పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ తేనె, 1/2 నిమ్మరసం కలిపి తాగాలి. దాల్చిన చెక్క నీరు, ఇది ఇన్సులిన్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి, కొవ్వు నిల్వలు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా తగ్గించడంలో ఉపయోగపడుతుంది.1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 గ్లాస్ వేడి నీటిలో కలిపి 10 నిమిషాలు ఉంచాలి. నిద్రకు ముందు తాగాలి.
గ్రీన్ టీ,గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి, మెటాబోలిజాన్ని వేగవంతం చేస్తుంది. తల్లులకు ఎనర్జీ ఇచ్చి, శరీరంలో ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది. రోజుకు 1-2 సార్లు గ్రీన్ టీ తాగడం మంచిది. వీటిని తాగిన వెంటనే ఫలితం ఆశించకండి, కనీసం 3-4 వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ శాతం కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చిన్నపాటి వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల త్వరగా ఫలితాలు కనపడతాయి.