క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తోక నిరోధక శక్తిని నివారించడంలో క్యారెట్ సహాయపడుతుంది. రోజు ఒక క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. క్యారెట్లలోని బీటా కెరోటిన్ విటమిన్ A గా మారి కంటి చూపుకు మేలు చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. రక్తహీనతను తగ్గించడంతోపాటు విటమిన్ B6, విటమిన్ C రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులనుండి కాపాడుతుంది. క్యారెట్ లో ఉన్న ఫైబర్ చేయాల వ్యవస్థను మెరుగుపరి బలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.

క్యారెట్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. కంటి చూపు, జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంతరణలో ఉంటుంది. లివర్, లంగ్స్, కోలన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి లివర్ పనితీరు మెరుగు పడటానికి సహాయపడుతుంది. క్యారెట్ లతో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బిపి నియంత్రణలో ఉంటుంది.

క్యారెట్లలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యారెట్లలో లూటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల మెదడు పనితీరును ఇవి మెరుగు పరుస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటాయి. ఆక్సీకర్ణ ఒత్తిడి తగ్గుతుంది. క్యారెట్ రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయని అధ్యాయనంలో వెల్లడయింది. క్యారెట్లలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడతాయి. వయసు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. చర్మం లో సహజ సిద్ధమైన కాంతి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: