ప్రతి ఒక్కరు తాము అందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాల క్రీమ్లను రాస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉండే పిండి పదార్థాలతో సులభంగా ఫేస్ స్క్రబ్ లను తయారు చేసుకుని చర్మానికి తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఈ సహజ స్క్రబ్ లు ఎలాంటి రసాయనాలు లేకుండానే ముఖానికి మెరుపును, గురుత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు వాటిలో ముఖ్యమైన పిండి రకాల గురించి వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అందానికి సన్నగా పిండిని చాలా ప్రత్యేకంగా వాడతారు. ఇది సహజంగా ముఖంపై ఉన్న మురికిని తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది. 

శనగపిండి నీ ముఖంపై స్క్రబ్లా వాడితే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం తాజాగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలు, జిడ్డును పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది. శనగపిండి చర్మానికి నెమ్మదిగా స్క్రబ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ పిండితో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం చాలా మృదువుగా మారుతుంది. పండినా బొప్పాయి గుజ్జులో కొద్దిగా చక్కెర బాదం నూనె, తేనే కలిపి విశ్రమంగా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపు అయ్యాక క్లీన్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి ఈ విష్టవంతో చర్మంపై స్క్రబ్ చేయండి. కాసేపు ఉంచి ముఖం కడుక్కుంటే చర్మం అందంగా మారుతుంది.

 పండిన ఆపిల్ పండు గుజ్జులో కొద్దిగా తేనె, కొన్ని చుక్కల జోజోబా ఆయిల్ వేసి ఈ విశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. 15 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి ఈ విశ్రమాన్ని చర్మానికి రాసుకోండి. కాసేపు మర్దన చేసి 10 నిమిషాల తర్వాత ఏం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చాక్లెట్ పొడి, బలంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. నిమ్మకాయపై చక్కెర వేసి లేదా నిమ్మరసంలో కొద్దిగా చక్కెర కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: