కొబ్బరి చిప్ప అంటే మనం సాధారణంగా ఉపయోగం లేని దానిగా పరిగణిస్తాం. కానీ నిజానికి ఈ కొబ్బరి చిప్పలోనూ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మరియు చర్మ సంరక్షణకు ఉపయోగపడే ప్రత్యేక గుణాలు ఉన్నాయి. కొబ్బరి చిప్ప పౌడర్ను ఉపయోగించి మనం సహజసిద్ధమైన, రసాయన రహితమైన బ్యూటీ మాస్కులు తయారుచేసుకోవచ్చు. ఇవి ముఖం మెరుగు పరచడంలో, మృత కణాలను తొలగించడంలో, చర్మం తేలికగా ఉండేలా చేయడంలో ఎంతో సహాయపడతాయి.

కొబ్బరి చిప్ప + తేనె మాస్క్, కొబ్బరి చిప్ప పౌడర్ – 1 టీస్పూన్, తేనె – 1 టీస్పూన్, కొద్దిగా నీరు, చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా, మోయిస్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది. మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముద్దగా మర్దించుకుని కడగాలి. కొబ్బరి చిప్ప + పెరుగు మాస్క్, కొబ్బరి చిప్ప పొడి – 1 టేబుల్ స్పూన్,పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, చల్లదనం కలిగిస్తుంది.మెత్తగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. కొబ్బరి చిప్ప + లెమన్ జ్యూస్ మాస్క్, కొబ్బరి చిప్ప పొడి – 1 టీస్పూన్, నిమ్మరసం – 1 టీస్పూన్, చెమ్మదనం నియంత్రిస్తుంది. ముడతలు, మొటిమల నుంచి ఉపశమనం.

 ముఖానికి 10 నిమిషాలు పెట్టి కడగాలి. వారం లోకి తేడా కనిపిస్తుంది. కొబ్బరి చిప్ప + అలొవెరా మాస్క్, కొబ్బరి చిప్ప పొడి – 1 టీస్పూన్, అలొవెరా జెల్ – 1 టేబుల్ స్పూన్, చర్మం కాంతివంతంగా మారుతుంది. వదులైన చర్మానికి టైట్‌నేస్ వస్తుంది. మాస్క్‌గా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. కొబ్బరి చిప్ప + పసుపు మాస్క్, కొబ్బరి చిప్ప పొడి – 1 టీస్పూన్, పసుపు – చిటికెడు, నీరు లేదా రోస్ వాటర్, అంటువ్యాధుల నివారణ, మొటిమలు తగ్గేలా చేస్తుంది. మొటిమల ప్రదేశంలో మాత్రమే అప్లై చేయాలి. వారం రోజులు చాలు తేడా కనిపించేందుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: