
పన్నీర్‌లో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలకు ఇది చాలా అవసరం. పన్నీర్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీవక్రియను వేగవంతం చేస్తాయి.
పన్నీర్‌లో ఫైబర్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పన్నీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయపడుతుంది. కాబట్టి ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక.
పన్నీర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరల రూపంలో తీసుకున్నప్పుడు ఈ నష్టం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి లాక్టోస్ అసహనం ఉంటుంది. అలాంటి వారు పన్నీర్ తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు కిడ్నీలపై భారాన్ని పెంచుతాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పన్నీర్ ఎక్కువగా తినడం మంచిది కాదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు