
మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల రకరకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువైపోతున్నాయి. వయసు తేడా లేకుండా చిన్నా–పెద్దా, ముసలి అందరికీ కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటిలో ఒకటే ఈ కాళ్లు పట్టేయడం. తొడ కండరాలు పట్టేయడం, పిక్కలు పట్టేయడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. పగలు బాగానే ఉన్నా రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి.
ఇలా కండరాలు పట్టేయడానికి ప్రధాన కారణాలు:
*వయసు పెరగడం
*పోషక ఆహారం లోపం
*ఎక్కువ గేమ్స్ ఆడటం లేదా హార్డ్ ఎక్సర్సైజ్ చేయడం
సడెన్‌గా ఇలా పట్టేసినప్పుడు వచ్చే నొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండు నిమిషాల పాటు ప్రాణం పోయినంతగా బాధ పెడుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? డాక్టర్ల సూచన ప్రకారం, ఐస్ రాయడం చాలా ఉపయోగకరం. ఐస్ ముక్కలను ఒక గుడ్డలో వేసి లేదా ఐస్ ప్యాక్‌ని కండరాలు పట్టేసిన చోట పెట్టాలి. కొంతసేపు ఉంచితే పెయిన్ తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది. కాళ్లు పట్టేసినప్పుడు కాలును అటూ ఇటూ కదపకుండా నేరుగా ఒక నిమిషం ఉంచితే కూడా నొప్పి తగ్గుతుంది. బాడీలో పొటాషియం తగ్గినప్పుడు కూడా కండరాలు పట్టేయొచ్చు. అందుకే అరటిపండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. నూనె మసాజ్ కూడా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా ఆవ నూనె ఒక్కో స్పూన్ తీసుకుని లైట్‌గా వేడి చేసి పట్టేసిన చోట మృదువుగా మసాజ్ చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు ఫ్రీ అవుతాయి, పెయిన్ తగ్గుతుంది. సాధారణంగా కొంత మంది నీరు ఎక్కువగా తాగనే తాగరు. ఇలాంటి వారు డీ హైడ్రేషన్ కు గురవుతారు. అలా డీ హైడ్రేషన్ ఉన్న వారికి కూడా ఇలా కండరాలు, పిక్కలు పట్టేయడం ఎక్కువుగా జరుగుతూంటాయి. ఇలా పట్టేసినప్పుడు నీరు ఎక్కువుగా తాగాలి అంటున్నారు డాక్టర్లు. దీంతో ఈ సమస్య నుంచి ఉపశనం లభిస్తుంది. కొంతమంది దీనికి మెడిసిన్స్ కూడా వాడుతున్నారు. కానీ యంగ్‌స్టర్స్‌కు ఇలాంటి నేచురల్ టిప్స్ చాలానే ఉపయోగపడతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కొంతమంది డాక్టర్ల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎంతవరకు అనుసరించాలి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగతంగా సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం అత్యంత మంచిది అని గుర్తు పెట్టుకోండి..!!