
రీసెంటుగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ధనుష్ మాట్లాడుతూ..“నేను ‘జగమే తంబిరా’ సినిమాలో పరోటాలు కాల్చాను. ‘తిరుచిత్రం బలం’ సినిమాలో డెలివరీ బాయ్‌గా పని చేశాను. ఇక రాయబట్టాలు ఫాస్ట్ ఫుడ్ దుకాణాన్ని తెచ్చాను.ఈ ‘ఇడ్లీ కడాయి’ సినిమాలో ఇడ్లిని కాలుస్తున్నాను” అని, తన కష్టపడి సాధించిన ప్రయాణాన్ని గుర్తు చేశారు. అంతే కాకుండా, ధనుష్ ఓ కీలక సందేశం కూడా ఇచ్చారు. “చాలామంది జనాలు థియేటర్లకు రాలేదు. ఒక సినిమా ఉదయం 9 గంటలకు రిలీజ్ అయితే, కొన్ని రివ్యూస్ ఉదయం 8 గంటలకే నెగిటివ్‌గా వస్తాయి. వాటిని నమ్మకండి. మిమ్మల్ని మీరు సినిమాను చూసి అంచనా వేయండి. సినిమా ఎలా ఉందో, మీ డి అనుభవం ఆధారంగా రివ్యూ ఇవ్వండి.
ప్రతి సినిమా పరిశ్రమకు చాలా ఇంపార్టెంట్, ప్రతి సినిమా బాగా నడవాలంటే, అది మీ చేతుల్లోనే ఉంటుంది. దయచేసి నెగిటివ్ రివ్యూస్‌ను నమ్మకండి, థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసి, ఆ తర్వాతే సోషల్ మీడియాలో రివ్యూ ఇవ్వండి.”ధనుష్ ఈ మాటలకు ఫ్యాన్స్ కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ లో, “నిజమైన ధనుష్ ఫ్యాన్స్ అయితే, ఆయన చెప్పినట్లు సినిమా థియేటర్‌లో చూసి, రివ్యూ ఇవ్వండి. రివ్యూస్ చూసి మోసపోయే సినిమాకు వెళ్లకుండా ఉండకండి” అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇడ్లీ కొట్టు ఎలా ఫ్యాన్స్ కి ఎంటర్టైన్ చేస్తుందో..??