ఏపీలో తెలుగుదేశం-జనసేన పొత్తు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిస్తే ఏం అవుతుందో...2014 ఎన్నికలు రుజువు చేశాయి. ఈ రెండు పార్టీలు విడిపోవడం వల్ల వైసీపీకి ఎంత లాభమో 2019 ఎన్నికలు చాటిచెప్పాయి. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బాగా అడ్వాంటేజ్ జరిగింది. ఒకవేళ అప్పుడు కలిసి పోటీ చేసి ఉంటే...రెండు పార్టీలకు కనీసం 60 సీట్లు పైనే వచ్చేవనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.

అయితే విడిగా పోటీ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో...టి‌డి‌పి-జనసేనలకు అర్ధమైనట్లు ఉంది. అందుకే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కొన్ని మండలాల్లో కింది స్థాయి నాయకులు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టారు. అంతే అధికారికంగా చెక్ పెట్టుకుంటే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పొచ్చు. అయితే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్‌లో పడొచ్చు. అలా డేంజర్‌లో పడే ఎమ్మెల్యేల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా ఉంటారని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో చిట్టిబాబు 22 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పిపై గెలిచారు. అయితే ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు 36 వేలు. అంటే జనసేన-టి‌డి‌పిలు కలిస్తే చిట్టిబాబు పరిస్తితి ఏం అయ్యేదో చెప్పాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే చిట్టిబాబుకు కష్టం కాబట్టి, ఇకనుంచైనా చిట్టిబాబు అలెర్ట్ గా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతాయి. ఇటు చిట్టిబాబు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. కానీ నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. రోడ్ల పరిస్తితి బాగోలేదు. ఇక్కడ ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. గోదావరికి వరద వస్తే లంక గ్రామాలు మునిగిపోతాయి. రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ చిట్టిబాబు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో మంచి విజయాలే సాధించారు. కానీ టి‌డి‌పి-జనసేనతో కాస్త ఇబ్బంది. తాజాగా ఎం‌పి‌టి‌సి ఎన్నికల్లో పి.గన్నవరం మండలంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటే చిట్టిబాబుకు గెలుపు కష్టమే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp