కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో ఫుల్ జోష్ లో ఉంది. కన్నడలో కన్నా తెలుగులోనే అమ్మడికి రెమ్యునరేషన్ తో పాటుగా ఆఫర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరుతో పాటుగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా చేస్తుందని తెలిసిందే. అయితే కన్నడలో మాత్రం రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం వల్ల రష్మిక మీద నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

 

ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషలతో పాటుగా తమిళంలో కూడా ఛాన్సులు అందుకుంటుంది రష్మిక మందన్న. ఇదిలాఉంటే రక్షిత్ శెట్టి నటించిన అతడే శ్రీమన్నారాయణ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. సచిన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ సౌత్ అన్ని భాషల్లో రిలీజైంది. అయితే ట్రైలర్ కు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

రష్మిక మాజీ లవర్ అనగానే రక్షిత్ శెట్టికి ఇక్కడ పాపులారిటీ ఏర్పడింది. అతడే శ్రీమన్నారాయణ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తన మాజీ లవర్ టాలీవుడ్ ఎంట్రీతో రష్మిక హ్యాపీనా లేక అన్ హ్యాపీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఓకే చెప్పలేదు కాని స్నేహితులుగా వారిద్దౌ ఇప్పటికి టచ్ లో ఉన్నారన్నది కొందరి మాట.

 

ఏది ఎలా ఉన్నా తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక ఇక్కడకు రక్షిత్ శెట్టి ఎంట్రీ ఇవ్వడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కె.జి.ఎఫ్ తర్వాత తెలుగు మార్కెట్ పై కన్నడ హీరోల కన్ను పడ్డది. యశ్ సినిమా హిట్ అవడంతో మంచి సినిమా అయితే తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారన్న నమ్మకంతో రక్షిత్ శెట్టి సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో రక్షిత్ శెట్టి తెలుగు లో క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: