టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 150 చిత్రాలకు పైగా నటించి తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనతో, డాన్స్ లతో డైలాగ్ లతో టాలీవుడ్ మెగాస్టార్ గా నెంబర్ వన్ హీరోగా ఎదిగిన ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. పరిశ్రమలోకి వచ్చి నలభై ఏళ్లకు పైనే అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

ఆయన నటించిన కొన్ని సినిమాలు విదేశీ భాష లోకి డబ్ అయిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చిరు కౌబాయ్ గా కొదమ సింహం సినిమా లో నటించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది. ఇక ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ లో అనువాదమైనా తొలి సౌత్ ఇండియన్ మూవీ గా నిలిచింది. హంటర్ ఆఫ్ ద ఇండియన్ ట్రెజర్ పేరుతో ఇంగ్లీషులో అనువదించగా ఆయన నటించిన స్వయంకృషి పసివాడి ప్రాణం చిత్రాలు కూడా రష్యన్ భాషలోకి డబ్ అయ్యాయి. స్వయంకృషి సినిమా మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శింపబడింది.

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఈ ఘనత సాధించడం తెలుగువారికి గర్వకారణం. ప్రస్తుతం ఆయన హీరోగా ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత లూసిఫర్ అనే మలయాళం రీమేక్ లో, వేదళం అనే తమిళ రీమేక్ సినిమాలో ఆయన నటించబోతున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబి దర్శకత్వంలో ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేస్తున్నారు మెగాస్టార్

మరింత సమాచారం తెలుసుకోండి: