అనసూయ బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెర పై కూడా మెరుస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన అనసూయ.. సుకుమార్ దర్శకత్వలో వచ్చిన రంగస్దలం సినిమా రంగమ్మత్తగా యాక్టింగ్ ఇరగదీసింది. అంతేకాదు ఆ తరువాత వచ్చిన " థ్యాంక్ యు బ్రదర్ " అనే సినిమాలోను యాక్టింగ్ పరంగా కుమ్మేసింది. దీంతో అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అనసూయ సుకుమార్ డైరెక్షన్ లోనే " పుష్ప" అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుంది. ఈ సినిమాలో అనసూయ స్టార్ కమెడియన్ సునీల్ కు భార్య చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఆమె ఫస్ట్ లుక్ సినిమా పై భాలీ అంచనాలను పెట్టుకునేలా చేసింది.
ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన అనసూయ ఇప్పుడు కోలీవుడ్ లోను తన లక్ ను పరీక్షించేందుకు రెడీ అయ్యింది. అనసూయ, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా లీడ్ రోల్ లో "ఫ్లాష్ బ్యాక్" అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలీసందే. ఈ సినిమాలో అందాల తార రెజీనా కసాండ్రా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అభిషేక్ ఫిలిమ్స్’ బేనర్ మీద రమేష్ పిళ్లై నిర్మిస్తున్నా ఈ సినిమాని డాన్ శాండీ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సీఎస్ పని చేస్తున్నాడు. ఈ సినిమాను మొదట తమిళంలో తీసి..ఆ తరువాత తెలుగులోకి డబ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అనసూయకు అక్కడ ఎలాంటి ఆరంభం లభిస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..!!