డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు చాలామంది ఉంటారు. అయితే చిన్నప్పటి నుండ్డి క్లవర్ స్టూడెంట్ గా ఐ.ఏ.ఎస్ అవ్వాలనే గోల్ తో ఉన్న రాశి ఖన్నా సడెన్ గా హీరోయిన్ గా మారి సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది. రాశి ఖన్నా మంచి క్లవర్ స్టూడెంట్ అట. బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన ఆమె ఐ.ఏ.ఎస్ అవ్వాలనే కోరిక ఉందట. అయితే సడెన్ గా మోడలింగ్ వైపు అడుగు పెట్టింది. యాడ్స్ లో ఆమె కాపీ రైటర్గా పనిచేసింది. ఆ తర్వాత సడెన్ గా మూవీ ఛాన్సులు రావడంతో ఆమె హీరోయిన్ గా మారింది.

డెళి నుండి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించింది. అయితే అంతకన్నా ముందే బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింద్ది. అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ఆమెకు మొదటి తెలుగు హిట్ అందించింది.

ఇక అప్పటి నుండి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది రాశి ఖన్నా. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య థ్యాంక్ యు, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న రాశి ఖన్నా తమిళంలో కూడా వరుసగా నాలుగు సినిమాలకు సైన్ చేసింది. ఓ పక్క బాలీవుడ్ లో కూడా యొధ అనే సినిమాకు సైన్ చేసింది అమ్మడు. మొత్తానికి రాశి ఖన్నా కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెంకపడ్డ రాశి ఖన్నా యువ హీరోలకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది. యువ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ పెయిర్ గా అనిపిస్తుంది. అందుకే వరుసగా యంగ్ హీరోలతోనే జతకడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: