అందాల ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేరళ ముద్దుగుమ్మ అయినప్పటికీ పూర్ణ అచ్చమైన తెలుగు అమ్మాయిల ఉండడం వల్ల ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. పూర్ణ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా,  ఇతర పాత్రల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన పూర్ణ ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే ఆహా 'ఓ టి టి' లో 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి పూర్ణ ప్రేక్షకులను అలరించింది.  ఇలా సినిమాలు , వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించిన పూర్ణ 'డీ' షో కు కొంత కాలం పాటు జడ్జిగా కూడా వ్యవహరించింది. కాకపోతే  డీ షో నుండి పూర్ణ కొన్ని రోజుల క్రితమే తప్పుకుంది.  డీ షో నుంఫై ఎందుకు తప్పుకుంది అనే విషయాన్ని ఇన్నాళ్లకు పూర్ణ వెల్లడించింది.

డీ నుండి కౌగిలింతలు ఇవ్వలేక తప్పుకున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేసింది పూర్ణ. డీ షో లో డ్యాన్స్ బాగా చేసిన డ్యాన్సర్ లకు కౌగిలింతలు ఇవ్వాలి అని, వారితో పాటు డ్యాన్స్ మాస్టర్ లకు మరియు యాంకర్  లకు కూడా హగ్స్ ఇవ్వాలి అని పూర్ణ చెప్పింది. అలా కౌగిలింతలను ఇవ్వడం ఇష్టం లేకే ఆ షో నుంచి తప్పుకున్నానని పూర్ణ తెలిపింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా , వెబ్ సిరీస్ ల ద్వారా , టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పూర్ణ త్వరలోనే షానిద్ అసిఫ్ ను పెళ్లాడబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: