మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సత్యదేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ మలయాళం లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి లూసీఫర్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది.  గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. గాడ్ ఫాదర్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు కూడా లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ పై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ "గాడ్ ఫాదర్" మూవీ గురించి స్పందిస్తూ ... గాడ్ ఫాదర్ మూవీ లో జరిగిన కొన్ని మార్పులు బాగున్నాయి  అని , కానీ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటి స్లో పేస్ కథలు సెట్ కావు అని పరుచూరి గోపాలకృష్ణ తాజాగా చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ కి సల్మాన్ ఖాన్ ప్లస్ మరియు మైనస్ అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఉండగా సల్మాన్ ఖాన్ ఫైట్ సీక్వెన్సెస్ చేయడం అంతగా నచ్చలేదు అని ,  సల్మాన్ ఖాన్ పాత్రలో రామ్ చరణ్ లేదా పవన్ కళ్యాణ్ ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: