
ఇప్పటికే కార్తీకి వెళ్లి కథ చెప్పి ఓకే అనిపించుకుని వచ్చాడట పరశురాం. రీసెంట్ గానే విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పరశురాం. దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే విజయ్ ఖుషి సినిమా లేట్ అయ్యేలా ఉందని ఈలోగా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు పరశురాం. కార్తీ ఓకే అంటే వెంటనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ గా రేంజ్ రాజా అని కూడా అనుకుంటున్నారట. రేంజ్ రాజా టైటిల్ లోనే మాస్ అప్పీల్ ఉంది. కార్తీకి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్. పరశురాం కూడా ఈ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది.
అయితే కార్తీ తో చేసే సినిమా నిర్మాత ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ లో పరశురాం చేయాల్సిన సినిమా చేయకుండా దిల్ రాజుతో సినిమా అనౌన్స్ చేశాడని అల్లు అరవింద్ గుస్సా అయినట్టు తెలిసిందే. అందుకే కార్తీ సినిమాను గీతా ఆర్ట్స్ లో చేసినా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి సర్కారు వారి పాట తర్వాత పరశురాం ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తప్పకుండా ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటన్నది తెలుస్తుంది. మహేష్ తో సినిమా చేశాక కూడా ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు పరశురాం.