
ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటూ ఊరిస్తున్నారు తప్పిస్తే ..ఎక్కడ కూడా అది ముందుకు కదలడం లేదు . అంతా ఓకే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అఫీషియల్ అప్డేట్ రావడంతో జనాలు ఫుల్ హ్యాపీ అయ్యారు. నందమూరి ఫ్యాన్స్ గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కానీ కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాని పై బాలయ్య స్పందించకపోవడంతో ఇది అంతా నిజమే అనుకున్నారు జనాలు.
అంతేకాదు ఆ తర్వాత చాలామంది దర్శకుల పేర్లు లైన్లోకి వచ్చాయి . నాగ్ అశ్వీన్.. వెంకీ అట్లూరి .. బోయపాటి శ్రీను .. శేఖర్ కమల చాలామంది స్టార్ట్ డైరెక్టర్ ల పేర్లు తెరపైకి వచ్చిన మోక్షజ్ఞ సినీ ఎంట్రీ మాత్రం ఇంకా అఫీషియల్ గా కన్ఫామ్ కాలేదు . దీంతో సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు కొందరు ఆకతాయిలు . అటు రోలుకి ఇటు రోకలికి అంటని పచ్చడిగా మిగిలిపోవడం అంటే ఇదే కాబోలు . ఈ సామెత మోక్షజ్ఞ కి బాగా సెట్ అవుతుందేమో.. అటు సినిమాలకి లేకుండా ఇటు రాజకీయాలకు లేకుండా అసలు ఏం అవుదామని మోక్షజ్ఞ వెయిట్ చేస్తున్నాడు..? అంటూ కూసింత ఘాటుగానే ట్రోల్ చేస్తున్నారు..!