
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే చాలు.. వందల కోట్ల బడ్జెట్. అంతకు మించి బిజినెస్ జరుగుతుంది. ప్రభాస్ చేసిన వాటిల్లో ఇటీవల రాజాసాబ్ చిన్న సినిమా అనుకున్నారు. ఆ సినిమాకు కూడా ఏకంగా రు. 400 కోట్ల బడ్జెట్ అయిపోయింది. ప్రభాస్‌తో మిడ్ రేంజ్ సినిమా తీయాలనుకున్నా బడ్జెట్ భారీగా అయిపోతోంది. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఇమాన్వి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను హీరోయిన్ గా తీసుకున్నాడు దర్శకుడు హను. మైత్రీ వాళ్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు ఏకంగా రు. 600 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఇది లవ్ స్టోరీ అయినా .. ఇందులో ఫిరియాడికల్ స్టోరీ ఉండడం... వార్ బ్యాక్ డ్రాప్ ఉండడంతో ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. దేశ, విదేశాల్లో పలు ప్రదేశాల్లో షూట్ చేస్తూ రావడంతో ఖర్చు భారీగా పెడుతున్నారు. ప్రభాస్‌కు భారీగా పారితోషకం ఇవ్వాలి .. మిగతా రెమ్యూనరేషన్లు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిపితే బడ్జెట్ రూ.600 కోట్లు దాటిపోతుందట. ఇక మైత్రీ వాళ్లు బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడరన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు ఉన్న తిరుగులేని మార్కెట్ దృష్ట్యా ఈ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం కష్టమేమీ కాదని మైత్రీ వాళ్ల ప్లాన్ అట.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.