
క్రికెట్ క్రీడకు మనదేశంలో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ సినిమా తరువాత జనాలు ఎక్కువగా చూసేది క్రికెట్ నే. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ చూడడమే కాదు.. విపరీతంగా ఆడతారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఫ్యాన్స్ కొట్టుకోవడం, క్రికెటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం… ఇలా ఒకటేమిటి, కను సైగలతో ఒకరినొకరు కవ్వింపు చర్యలకు దిగుతూ వుంటారు. మరికొన్ని సమయాలలో వికెట్ తీస్తే బౌలర్లు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బౌలర్ చేసిన పని.. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన నవ్వులు పూయిస్తోంది.
విషయం ఏమిటంటే? సదరు బౌలర్ వికెట్ తీయగానే విచిత్ర రీతిలో పండగ చేసుకుంటాడు. ఈ క్రమంలో మరికొంతమంది బౌలర్లు రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకోవడం సదరు వీడియోలో మీరు గమనించవచ్చు. వికెట్ తీసిన తర్వాత సదరు బ్యాటర్ ని రెచ్చగొడుతూ ఓవర్ చేస్తారు బౌలర్లు. సదరు బౌలర్ విసిరిన బంతిని… మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు బ్యాటర్. కానీ ఆ బంతి సరిగ్గా తగలకుండా… మిస్ అయి పోయింది. ఈ నేపథ్యంలో ఆ బ్యాటర్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకేముంది బౌలర్ రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఎవరు ఊహించని విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో ఆ బౌలర్ మొదట తన షు విప్పేశాడు. ఆ తర్వాత తన షర్ట్ విప్పేసి… అర్ధ నగ్నంగా గ్రౌండ్లో పరుగెత్తాడు. షర్ట్ విప్పి ఆగుతాడు అనుకుంటే అక్కడితో మనోడు ఆగలేదు. లోపల ఉన్న బనియన్ కూడా.. విప్పేసి సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసుకొని గ్రౌండ్ లో హల్ చల్ చేశాడు. గ్రౌండ్ మొత్తం తిరుగుతూ… ఏదో వరల్డ్ కప్ సాధించిన రీతిలో రెచ్చిపోయాడు. ఇక అతని సెల బ్రేషన్స్ చూసిన తోటి క్రికెటర్లు సైతం నవ్వుకున్నారు. మరోవైపు ఫీల్డ్ అంపైర్లు కూడా… వీడికి పిచ్చా అన్నట్టుగా… ఆశ్చర్యపోయి మరీ వాడి వాలకాన్ని చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నేటిజన్స్, క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.