పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ సినీ కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అతి చిన్న వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అనంతరం ఈ హీరో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమా రాబోతోంది. అయితే ఎన్టీఆర్సినిమా కోసం ఏకంగా 18 కేజీల బరువు తగ్గినట్టుగా సమాచారం అందుతోంది. కేవలం ఐదు నెలలలోనే ఆయన ఎలాంటి ఇంజెక్షన్లు వాడకుండా చాలా నేచురల్ గా బరువు తగ్గినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఎన్టీఆర్ చాలా కఠినమైన వర్కౌట్ లు, డైట్ కారణంగానే ఎన్టీఆర్ లుక్ పర్సనాలిటీలో చాలా మార్పులు వచ్చినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఒకానొక సమయంలో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు.

తన బాడిపై చాలామంది నెగటివ్ గా ట్రొల్స్, కామెంట్లు కూడా చేశారు. ఎలా అయినా బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ చాలా కష్టపడి బరువు తగ్గి సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే చాలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారు. కాగా, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: