టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ నటించిన సినిమాలు వరుసగా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. కొంత కాలం క్రితం రామ్ "ది వారియర్" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈయన నటించిన స్కంద , డబుల్ ఈస్మార్ట్ సినిమాలు కూడా ఈయనకు బాక్సా ఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి.

వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో RAPO 22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... ఈ మూవీ బృందం వారు రామ్ పుట్టిన రోజు సందర్భంగా అనగా మే 15 వ తేదీన ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు , ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు , అన్ని ఓకే అయితే మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

వరుస అపజయాల తర్వాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఆయన అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి రామ్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: