
మురికిగా ఉన్న దిండ్లు కవర్లు, చర్మంపై బ్యాక్టీరియా పెరిగేలా చేసి మొటిమలకు కారణం అవుతాయి. నిద్రలో ముఖాన్ని చేతులతో తాకడం వల్ల చేతులపై ఉన్న మురికి ముఖానికి చేరి మొటిమలు ఎక్కువ అవకాశం ఉంటుంది. బయటకు వెళ్లి వచ్చినప్పుడు ముఖాన్ని కడుక్కోకుండా ఉంటే దుమ్ము అనేది ముఖానికి పట్టి మొటిమలు రావడానికి దారితీస్తుంది. ముఖాన్ని దిండు పై బాగా ఒత్తి పడుకోవడం వల్ల ముఖంపై ఆయిల్ పేరుకు పోతుంది. ఇది మొటిమలకు కారణం అవుతుంది.
ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు మరింతగా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. తక్కువ నిద్ర వల్ల శరీర హార్మోన్ల సమతుల్యతకు గురి అవుతాయి. దీనివల్ల కూడా చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. మొటిమలు వస్తాయి. కొంతమంది రాత్రి వేళల్లో రాసుకునే నైట్ క్రీమ్ వల్ల కూడా చర్మం రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు మరింత ఎక్కువవుతాయి. కొందరు వెంటిలేషన్ లేని గదుల్లో నిద్రపోతుంటారు. దీనివల్ల చమట, దూళీ, బ్యాక్టీరియా ఎక్కువై మచ్చలు పెరుగుతాయి. రాత్రి సమయాల్లో ఆయిలి, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా ముఖంపై మొటిమలు పెరిగే ప్రమాదం ఉంది. నైట్ ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది.