టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో అనుష్క , కాజల్ అగర్వాల్ , సమంత మంచి ప్లేస్ లలో ఉంటారు. ఈ ముగ్గురు బ్యూటీలు కూడా ఒక విషయంలో సేమ్ ఫార్ములాను ఫాలో అయ్యారు. అదేమిటి అనేది తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ సినిమాల్లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేసేవారు కాదు. సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేయడానికి దాదాపుగా కొంత మంది బ్యూటీలు సపరేట్ గా ఉండేవారు. వారే ఎక్కువ శాతం సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ లలో నటిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అనుష్క "స్టాలిన్" మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. కాజల్ అగర్వాల్ కొన్ని సంవత్సరాల క్రితం జనతా గ్యారేజ్ మూవీ లో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ ద్వారా కాజల్ కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. సమంత "పుష్ప ది రైస్" సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

మూవీ పాన్ ఇండియా సినిమాగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ద్వారా సమంత కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇలా ఈ ముగ్గురు కూడా స్టార్ హీరోయిన్స్  క్రేజ్ వేసుకున్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కాకపోతే వీరు ముగ్గురు కూడా ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ చేసి ఆపేశారు. అలా ఈ ముగ్గురు కూడా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఒకే ఫార్ములాను ఫాలో అవుతున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: