నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు బుల్లితెరపై ఆడియన్స్ ను అలరించడానికి పలు టీవీ షోలతో కూడా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ సీజన్ లకు హోస్టుగా వ్యవహరిస్తూ.. అత్యధిక టిఆర్పి రేటింగ్స్ సాధిస్తున్న టీవీ షోగా రికార్డు సృష్టించారు. ఒకప్పుడు హోస్టుగా పనికిరారు అన్నవారే ఈయన హోస్టింగ్ చూసి వారెవ్వా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అలా వరుసగా సినిమాలు చేస్తూ మరొకవైపు టీవీ షో లతో ఆకట్టుకుంటున్న ఈయన ఇప్పుడు మరో షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బాలకృష్ణ హోస్ట్గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో దేశవ్యాప్తంగా సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోని ఆయన మరో రియాలిటీ షో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి బాలకృష్ణ హోస్టుగా చేయబోతున్నారని సమాచారం. నాగార్జున స్థానంలో బాలకృష్ణను తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్బాస్ తెలుగు షో కి అంతగా ఆదరణ లభించడం లేదని, రేటింగ్ పడిపోతుందని, అందుకే బాలయ్యను రంగంలోకి దింపబోతున్నారని వార్తలు రాగా.. దీనిపై బాలయ్య టీం స్పందిస్తూ ఇందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా రారు కానీ మరో టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఏడాది డాకూ మహారాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు అఖండ2 సినిమాతో బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక అలా  ఒకవైపు రాజకీయ నాయకుడిగా,  మరొకవైపు నటుడిగా,  ఇంకొక వైపు హోస్ట్ గా బిజీగా సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: