
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత మరింతగా ఊపు అందుకుంటాయి అని ప్రభుత్వం వర్గాలు చెపుతున్నాయి. మోడీ పర్యటన తర్వాత మరింత మంది ఆశావాహులు, ఎన్నారైలు కూడా పెట్టుబడులు పెడతారని లెక్కలు వేస్తున్నారు. ఇక రాజధాని పనుల కేటాయింపు దాదాపు పూర్తి అయింది. సచివాలయం ఐకానిక్ టవర్ల టెండర్లు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ముందే ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతిలోని నీరుకొండ గ్రామంలో మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు .. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుతో పాటు స్మారకం కూడా నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీనికి డీపీఆర్ ( సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ) సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్స్ ను పిలుస్తూ అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎఫ్ పీ జారీ చేయడంతో ఈ ప్రాజెక్టు పనులు మరింతగా ఊపందుకోనున్నాయి. ఈ విగ్రహ ఏర్పాటు డీపీఆర్ ఇచ్చే సంస్థలు మే 14 వ తేదీ లోగా తమ బిడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి ఎన్టీఆర్ భారీ విగ్రహం తో పాటు స్మారకం ఏర్పాటు చేస్తామని ప్రకటించగా అందుకు అనుగుణంగా నే అమరావతి డవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ చర్యలు చేపట్టింది.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.