ఏంటి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మీద ప్రేమతో పెళ్లి చేసుకోలేదా.. ఆ హీరోయిన్ వదిలేస్తే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లాడారా.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల మధ్య బంధం బద్రి సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన ప్రేమ కాస్త డేటింగ్ వరకు దారితీసింది.అలా డేటింగ్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోకుండానే రిలేషన్ పెట్టుకొని పెళ్లికాకుండానే అకిరా నందన్ కీ జన్మనిచ్చారు. అలా అకీరా నందన్ పుట్టాక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.అయితే అకీరా నందన్ తర్వాత ఆధ్యా పుట్టిన కొద్ది సంవత్సరాలకి ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నప్పటికీ రేణుదేశాయ్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తుంది. 

ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గీతా కృష్ణ రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ప్రేమ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమించక ముందే అమిషా పటేల్ ని ప్రేమించారు. అమీషా పటేల్ ఆయన పెట్టిన కండిషన్లకు ఒప్పుకోకపోవడంతో అదే సినిమా షూటింగ్లో ఉన్న మరో హీరోయిన్ రేణు దేశాయ్ ని అమీషా పటేల్ మీద ఉన్న కోపంతో ప్రేమించాడు.అయితే మొదట అమీషా పటేల్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య రిలేషన్ ఏర్పడి డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేయాలి అని అమీషా పటేల్ కి పవన్ కండిషన్ పెట్టారు. కానీ ఆ కండిషన్లకు అమీషా పటేల్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్.

దాంతో పవన్ కండిషన్లకు ఒప్పుకోక ఆమె రిజెక్ట్ చేసింది. ఇక ఆమె మీద కోపంతో అదే సినిమాలో నటిస్తున్న మరో నటి రేణు దేశాయ్ ని ప్రేమించి డేటింగ్ చేశారు. అలా రేణుదేశాయ్ కంటే ముందే పవన్ బద్రి సినిమా లో నటించిన మరో హీరోయిన్ అమీషా పటేల్ ని ప్రేమించాడు అంటూ గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈయన మాటలు విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. పవన్ అమీషా పటేల్ ని ప్రేమించి ఉంటే కనుక ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక్క రూమర్ కూడా వీరిపై ఎందుకు వినిపించలేదు. మీరు కావాలనే ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.ఎవరి పర్సనల్ లైఫ్ వారిది ఎందుకు లేని పోని రూమర్లు పుట్టిస్తున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: