తాజాగా కాశ్మీర్ లోని పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది ఇండియన్స్ చనిపోయారని తెలుస్తోంది. సడన్ గా పహల్ గామ్ లోకి ఉగ్రవాదులు చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేశారు. కొంతమంది బొట్టు పెట్టుకున్నారని,ముస్లిం కాదు హిందువు అని ఇలా కక్ష పెట్టుకొని చంపేశారని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే పహల్ గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రభాస్ మూవీ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ పై నెటిజన్లు మండి పడుతున్నారు.. మరి ఇంతకీ పహల్ గామ్ ఉగ్ర దాడికి ప్రభాస్ ఫౌజీ మూవీ హీరోయిన్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

అయితే ఈ సినిమాతో కొత్త అమ్మాయి ఇమాన్వి ఇస్మాయిల్ ని ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్ హనూ రాఘవపూడి. అయితే ఇమాన్వి ఇస్మాయిల్ ఇప్పటివరకు సినిమాలు చేయకపోయినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో ఆమె డాన్స్ వీడియో చూసి ఫిదా అయినా డైరెక్టర్ ఇమాన్వి ఇస్మాయిల్ కి ప్రభాస్ ఫౌజీ మూవీ లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ పూజా కార్యక్రమాల సమయంలోనే ఈ హీరోయిన్ కి సంబంధించి ఎన్నో వార్తలు వినిపించాయి.ముఖ్యంగా ఈ హీరోయిన్ పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని కూడా బయటపడింది. అయితే తాజాగా పహల్ గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ప్రభాస్ ఫౌజీ మూవీలో నటిస్తున్న హీరోయిన్ ని వెంటనే సినిమా నుండి తొలగించి మరో ఇండియన్ హీరోయిన్ ని పెట్టుకోవాలి అని ఇండియన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకంటే ఇమాన్వీ ఇస్మాయిల్ పాకిస్తానీ అమ్మాయి కాబట్టి పాకిస్తానీ అమ్మాయిలు ఇండియన్ సినిమాలలో నటించకూడదు అంటూ నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి ఇక్బాల్ పాకిస్తాన్లో కొద్దిరోజులు మిలిటరీ అధికారిగా పని చేశారు.అలా ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్ తీసుకొని యూఎస్ లో సెటిల్ అయ్యారు. కానీ పాకిస్తానీ కాబట్టి ఇమాన్వీ ఇస్మాయిల్ ని ఈ సినిమా నుండి తొలగించాలి అని ఇండియన్స్ డిమాండ్ చేస్తున్నారు.కానీ మరి కొంత మందేమో పహాల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ఇమాన్వీ ఇస్మాయిల్ కు మధ్య లింకు పెట్టడం ఏంటి.. వాళ్లు చేసిన పనికి ఈమెని ఎందుకు బలి చేయడం అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ మరికొంత మందేమో ఇమాన్వి ఇస్మాయిల్ ని తొలగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి నెటిజెన్స్ డిమాండ్ దృష్ట్యా డైరెక్టర్ హనూ రాఘవపూడి సినిమా నుండి ఇమాన్వీ ఇస్మాయిల్ ని తొలగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: