బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గ్లోబుల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని హాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఉన్నది. కానీ ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చి మహేష్ బాబు సినిమా SSMB -29 లో నటిస్తోంది.ఈ సినిమాతోనే మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నది. అది కూడా పాన్ వరల్డ్ స్థాయి సినిమా కాబట్టి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉన్నది. హీరోయిన్ ప్రియాంకచోప్రా కు తాజాగా ప్రపంచ స్థాయి అవార్డు కూడా లభించినట్లు తెలుస్తోంది.


ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించినటువంటి గోల్డెన్ హౌస్ గార్డ్ హానర్ అవార్డుకు సైతం ఈ ముద్దుగుమ్మ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సమస్థ అందించే అవార్డులు చాలా అరుదైనవిగా భావిస్తూ ఉంటారు. హాలీవుడ్ స్థాయి యాక్టర్లకు, గ్లోబల్ స్థాయి లీడర్లకు మాత్రమే వీటిని అందిస్తూ ఉంటారట. ఇప్పుడు అలాంటి సంస్థ అవార్డుకు సైతం హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎంపిక కావడంతో అటు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ విషయం తెలిసి బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తూ ఉన్నారు.


మే 10వ తేదీన లాస్ ఏంజెల్ లో మ్యూజిక్ సెంటర్ లో జరిగే ఎటువంటి ఈ అవార్డు నాలుగో వార్షిక సభలో ప్రియాంక చోప్రాకు ఈ అవార్డు అందజేయబోతున్నారట. ఈ సంస్థ ప్రతి ఏడాది కూడా 100 మంది ఆసియా, పసిఫిక్ లీడర్లు ,అలాగే యాక్టర్లను కూడా ఎంపిక చేయడం జరుగుతుందట.. ఆయా రంగాలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఈ అవార్డును అందజేస్తారు. ఇండియా నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ఇప్పుడు ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రముఖ స్టార్లతో కూడా నటించిన ప్రియాంక చోప్రా గ్లోబల్ స్థాయిలో ఇమేజిన్ అయితే సంపాదించుకుంది. ఈ ఇమేజ్ ఈమెకు బాగా కలిసి వచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: