కొత్తిమీరను ప్రతి వంటకాల్లోనూ ఎక్కువగా వాడుతూ ఉంటాము. చాలామందికి కొత్తిమీర లేకపోతే వంటరు. కొత్తిమీర చికెన్ లాంటి నీసు మాంసాల్లో ఎక్కువగా వాడతాము. కూర తయారు చేసే క్రమంలో చివర్లో కొత్తిమీర ఆకులు యాడ్ చేస్తాం. కొత్తిమీర ఆకులు కూరలకు రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఏ, సి, కె తో పాటుగా ఫోలిక్ యాసిడ్, పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లైవనాయిడ్స్ కూడా ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో మిరిస్టిసిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

 ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర తింటే ఇన్సులిన్ స్థిరంగా ఉంటుంది. కొత్తిమీర శరీరాన్ని డీటాక్స పై చేయడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు కలిపిన కూరలు తింటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర లో ఉండే ప్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. కొత్తిమీర తింటే గుండె సంబంధిత సమస్యలు రావు. కొత్తిమీరలో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. కొత్తిమీర తింటే ఆస్టియోపోరోసిన్ రిస్క్ తగ్గుతుంది.

 కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కొత్తిమీరను వివిధ రూపాల్లో తీసుకుంటే మలబద్ధకం, అజీర్తి కంట్రోల్ అవుతాయి. కొత్తిమీర లోని విటమిన్లు, మినరల్స్ ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. కొత్తిమీర తింటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. కొత్తిమీరను కూరల్లో యాడ్ చేసుకుని తీసుకుంటే కాలయ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా షుగర్ తో బాధిస్తున్న వారు లివర్ ఆరోగ్యం కోసం కొత్తిమీర తినండి. కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి కొత్తిమీర డైలీ తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. కొత్తిమీరలో ఉన్న ప్యుటాషియం మరియు ఇతర ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. మొటిమలు చర్మం ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: