ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హత్య ఘటనలు జరుగుతూ ఉన్నాయి.. అధికార పార్టీ టిడిపి ఉన్నప్పటికీ కూడా ఒంగోలులో తాజాగా టిడిపి నేత దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. మాజీ జెడ్పిటిసి ముప్పవరపు వీరయ్య చౌదరిని  కత్తులతో నరికి మరి చాలా అతి కిరాతకంగా కూడా చంపినట్లు తెలుస్తోంది. ఈ టిడిపి నేత మంగమూరు కూడలి సమీపంలో తన ఆఫీసులో వీరయ్యచౌదరి ఉన్నారనే విషయాన్ని గ్రహించిన ఆ దుండగులు అదే సమయంలో కత్తులతో వచ్చి మరి ఈ ఘాతుకానికి పాల్పడినారు.. అయితే ఆ దుండగులు సైతం ముఖాలకు ముసుగులు వేసుకొని మరీ వచ్చినట్లుగా అక్కడి స్థానికులు తెలియజేస్తున్నారు. స్థానికులు పోలీసులకు ఈ విషయం చెప్పగా..


అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ పోలీసులు సైతం హుటాహుతిగా రంగంలోకి దిగి సంఘటన ప్రాంతంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. అయితే ఈ హత్యలు నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించామంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో పడ్డామంటూ పోలీసులు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ ఘటన పైన హోంమంత్రి అనిత కూడా స్పందిస్తూ ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది.


హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలంటు ఎస్పీకి ఆదేశాలను జారీ చేసింది హోంమంత్రి అనిత. ఇలా అధికార పార్టీ అయినప్పటికీ కూడా టిడిపి నేత ఇంత దారుణంగా హత్య చేయడంతో ఒక్కసారిగా ఒంగోలులో ప్రజలు, నేతలు ,కార్యకర్తలు కూడా ఉలిక్కిపాటికి గురవుతున్నారు. ఆ సంఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా తగు నిర్ణయాలు తీసుకోవాలంటే పలువురు నేతలతో పాటు కూడా ఏపీ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: