తాజాగా చిత్ర బృందం రేపు సినిమా విడుదల సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అక్కినేని అభిమానులతో పాటు యాక్షన్ సినీ ప్రేక్షకులకు కూడా సర్ప్రైజ్ చేసే విధంగా కనిపిస్తోంది. అఖిల్ రెండు చేతుల్లో ఆయుధాలను పట్టుకొని చాలా కోపంగా నడుచుకుంటూ వస్తున్నట్లు ఒక వైల్డ్ లుక్కు ఉన్న పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. దీంతో నైటీ జాన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ రేంజ్ లో యాక్షన్ సినిమాను గతంలో చేసింది లేదు అంటూ కూడా తెలుపుతున్నారు.
హీరోగా అఖిల్ ఇప్పటివరకు దక్కని కమర్షియల్ బ్రేక్ ఈ చిత్రంతో దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్లో విడుదల చేయబోతున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో కేవలం కొన్ని భాషలలో మాత్రమే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హిట్టు టాకు వస్తే కచ్చితంగా ఇతర భాషలలో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అఖిల్ ఈ సినిమాకు రేమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేసినట్లు సమాచారం అలాగే డైరెక్టర్ కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూ రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.