ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ప్రతిసారి రకరకాల స్కీం లను అందుబాటులోకి తీసుకు వస్తోంది.. ఇక ఈ పథకాల వల్ల కస్టమర్లు కూడా ఎన్నో రకాలుగా లాభాలను పొందుతున్నారు. ఎల్ఐసి ప్రత్యేకంగా మనీ బ్యాక్ పాలసీ లను కూడా అందిస్తోంది. ఇక వీటి వల్ల అత్యధిక లాభాలు పొందవచ్చు.. అయితే వీటి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం


ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మంది ఈ మనీ బ్యాక్ పాలసీ లను తీసుకుంటున్నారు.. ఎందుకంటే ఈ పాలసీల వలన భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని , ముందుగానే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక అదే విధంగా న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ ఇప్పుడు సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో పిల్లల వయస్సును బట్టి పాలసీ యొక్క టర్మ్ కూడా మారుతుంది. ప్రస్తుతం ఈ పాలసీ 12 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు అందుబాటులో ఉంది.

ఈ పాలసీ యొక్క జీవిత పరిమితి 25 సంవత్సరాలు. ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఈ పాలసీని తీసుకుంటే,  24 సంవత్సరాల పాటు పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.. వన్ టైం ఇన్వెస్ట్మెంట్  కూడా చేసుకోవచ్చు.. ఉదాహరణకు మీ పిల్లలకు ఒక ఏడాది వయస్సు ఉన్నట్లయితే.. మీరు పది లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుందాం.. అంటే రోజుకు 125 రూపాయల చొప్పున ఆదా చేస్తూ నెలకు 3,700 రూపాయలను ప్రీమియం కింద చెల్లించాలి.

18 సంవత్సరాలు వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు తీసుకోవచ్చు. 20 సంవత్సరాలు వచ్చినప్పుడు రూ. రెండు లక్షలు,  22 సంవత్సరాలు వచ్చినప్పుడు మరో రెండు లక్షలతో పాటు 25 సంవత్సరాలు పూర్తయ్యేసరికి , 19 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే మొత్తంగా మీరు కాలపరిమితి ముగిసే సరికి 25 లక్షల రూపాయలను అందుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: