ఎప్పుడైనా సరే కాలానికి అనుగుణంగా వ్యాపారం చేసినప్పుడే మనకు మంచి ఆదాయం లభిస్తుంది. అయితే దీపావళి నేపథ్యంలో టపాసుల వ్యాపారం చక్కటి ఆదాయ వనరు అవుతోంది. ఇక దీనికోసం ఎంత పెట్టుబడి కావాలి? ఎవరి అనుమతులు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇకపోతే అదనపు ఆదాయం కోసం ఏదైనా సీజనల్ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రస్తుతం త్వరలో దీపావళి పండుగ రాబోతున్న నేపథ్యంలో టపాసుల బిజినెస్ చేసి చక్కటి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఎంత పెట్టుబడి అవుతుంది.. ?వ్యాపార చిట్కాలు ఏమిటి? అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా దీపావళి సమయంలో అన్ని వర్గాల వారు తమ ఇంటి ముందు టపాసులు పేల్చడానికి ఆసక్తి చూపిస్తారు.


ఇకపోతే తమ శక్తి కొద్దీ స్థాయిని బట్టి టపాసులు కొనుగోలు చేస్తారు.  ఒక వ్యాపార అవకాశంగా దీనిని మార్చుకోవచ్చు.  ముఖ్యంగా మీరు మీ గ్రామం లేదా పట్టణంలో దీపావళికి ముందు ఒక తాత్కాలిక షాప్ ఏర్పాటు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి టపాసుల పరిశ్రమకు చాలా ప్రసిద్ధి ఉంది.  ఇక్కడ ఫ్యాక్టరీలో టపాసులను తయారుచేస్తారు. ఇక అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ టపాసులను హోల్సేల్ ధరలకే సంవత్సరం అంతా విక్రయిస్తూ ఉంటాయి.  కాబట్టి దేశమంతా శివకాశి నుంచే టపాసులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.మీరు కూడా టపాసుల బిజినెస్ మొదలు పెట్టాలి అంటే ముందుగా స్థానికంగా పర్మిషన్ తీసుకొని తాత్కాలిక షాప్ కోసం రేకులతో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే స్థానిక అగ్నిమాపక కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి.

ఇక మీరు లాభసాటిగా వ్యాపారం చేయాలి అంటే తమిళనాడులోని శివకాశికి వెళ్లి హోల్సేల్ ధరలకు టపాసులను కొనుగోలు చేయవచ్చు.  అక్కడ మీకు ఎంఆర్పీ ధరల కన్నా 20  శాతం ధరలకే టపాసులు లభిస్తాయి.  కాబట్టి మీరు వాటిని స్థానికంగా ఎమ్ ఆర్ పీ రేటు కంటే 25% తక్కువకు అమ్మినా మీకు రెండింతలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్వాలిటీ ఉన్న సరుకులు తెచ్చుకుంటే మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇకపోతే ఈ పండుగను మీరు అవకాశంగా మార్చుకొని మంచి లాభం కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: