
దీంతో తెలుగు రాష్ట్రాలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఏపీ , తెలంగాణలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు రూ .960 స్థాయిలో ఉండడం గమనార్హం. ఇకపోతే దీనివల్ల సామాన్య ప్రజలకే కాదు చాలామందికి ఊరట కలుగుతుంది. అలాగే కొంతమందికి ఇంకా అదనపు బెనిఫిట్ కూడా అందించడానికి సిద్ధమయ్యింది కేంద్ర ప్రభుత్వం. పీఎం ఉజ్వల స్కీం కింద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందిన వారికి అదనంగా రూ .200 మేరా సబ్సిడీ లభిస్తుంది. అంటే ఉజ్వల స్కీం కింద సిలిండర్ తీసుకున్న వారికి ఏకంగా రూ.400 రూపాయల తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పవచ్చు.
అంటే వీరికి ఈ గ్యాస్ సిలిండర్ కేవలం రూ.760 కే లభిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా భారీ ఊరట కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో ఏపీ తెలంగాణలో మరికొంతమందికి కూడా ఈ రూ.200 సబ్సిడీ బెనిఫిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది దీపం స్కీం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన విషయం తెలిసిందే . వారు ఏకంగా 85 లక్షల మంది ఉన్నారు. అయితే ఇలా దీపం స్కీం కింద గ్యాస్ సిలిండర్ పొందిన వారికి మాత్రం రూ 200 సబ్సిడీ రావడం లేదు. అందుకే వీరికి కూడా సబ్సిడీ అందేలా చూడాలని డిమాండ్ నెలకొంది. మరి త్వరలోనే వీరికి కూడా సబ్సిడీ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.