డబ్బంటే ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు..ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలని.. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు.అయితే కరోనా తర్వాత చాలామంది గుర్తుపెట్టుకున్న విషయం ఏమిటంటే కష్ట సమయాలలో డబ్బు ఎంత అవసరం ఉంటుందనే విషయం చాలా మందికి అర్థమయింది.. ముఖ్యంగా పెద్దపెద్ద కంపెనీలో కూడా ఉద్యోగస్తులను తొలగించేశారు. ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తాయని భయం కూడా చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది.. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని సంపాదించుకోవాలనుకునే వారికి కొన్ని బిజినెస్ టిప్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం..


బేకరీ వస్తువులను తయారు చేయడానికి కచ్చితంగా పిండి అవసరం ఉంటుంది.అందుకే మన దేశంలో పిండి మిషన్లకు మంచి డిమాండ్ ఉంది.పల్లెలలో వీటిని పెట్టినట్లయితే మంచి లాభాలు ఉంటాయి.. అలాగే పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు అయితే మరింత ఆదాయాన్ని అందుకోవచ్చు.. ప్రస్తుతం కిలో పిండి ₹10 చొప్పున తీసుకుంటున్నారు.. ఇందులో 5 రూపాయలు పెట్టుబడి అయితే మరో 5 రూపాయలు మిగులు..


పౌల్ట్రీ వ్యాపారంలో అడుగు పెట్టాలనుకునేవారు.. నాటు కోళ్లు బాయిలర్ కోళ్లు గొర్రెల పెంపకం వంటి ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.. వీటితోపాటు పశువులను కూడా పెంచుకోవడం వల్ల వీటి వ్యర్ధపదార్ధాలు ద్వారా కూడా మంచి లాభాలను అందుకోవచ్చు. వీటికోసం కొంత పెట్టుబడి ఎక్కువ అయిన లాభాలు మాత్రం అధికంగానే ఉంటాయి.


పండ్లు కూరగాయల ఎగుమతి ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.. ప్రపంచవ్యాప్తంగా కూరగాయలకు భారీగానే రిమాండ్ ఉంటుంది.. కూరగాయలతో పాటు పుట్టగొడుగులు ఇతరత్రా వాటిని ఎగుమతులు చేయడం వల్ల భార్య గాని సంపాదించవచ్చు.


పసుపు, కుంకుమ, దాల్చిన చెక్క  ఇతరత్రా సుగంధ ద్రవ్యాలకు ఇండియాలో బాగ పేరుంది. కాబట్టి ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మంచి లాభాలను సంపు సంపాదించుకోవచ్చు..


ఎరువుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన కూడా మంచి లాభాలని సైతం అందుకోవచ్చు ఇప్పుడు గేదె ఆవు గొర్రె పేడకు మంచి డిమాండ్ ఉన్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: