రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో ఓ త్రిల్లర్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామందిని ట్రై చేశారట. మీడియం రేంజ్ హీరోయిన్లు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదట. దాంతో ఒకరకంగా హీరోయిన్ పాత్ర లేకుండానే ముందుకు వెల్దామనుకున్నారు.. కానీ కథ కి హీరోయిన్ తప్పని సరి కావడంతో మళ్ళీ వెతుకులాట ప్రారంభించారట.. అసలే రాజశేఖర్, పైగా ఫాంలో లేని నీలకంఠ దర్శకుడు కావడంతో కాస్త పేరున్న హీరోయిన్లెవరూ ఆసక్తి చూపించలేదట. చివరికి అప్పుడెప్పుడో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’లో కథానాయికగా నటించిన రిచా పనాయ్ను తీసుకున్నారట. మరి ఈ ముద్దుగుమ్మ కి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూద్దాం..