తేజ్ 'ప్రస్థానం' దేవా కట్ట దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఇది హిట్ అయితే మెగా మేనల్లుడు మరో స్థాయికి వెళ్లినట్లేనని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.  దీంతో పాటు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.