అభిమానుల కోసం రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసి వారిని సంతోషపెట్టాడు.. ఆ సినిమాల్లో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. బాలీవుడ్ లో పింక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఆ సినిమా రీమేక్ ని తెలుగు పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు మార్చి చేస్తున్నారు.. అమితాబ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుభాషల్లో రిలీజ్ కాగ తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు..