అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలుపెట్టిన దగ్గరినుంచి ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది..లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలు మొదలుపెట్టినా పుష్ప మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.. అందుకు కారణం కొన్ని రోజులు లొకేషన్స్ ప్రాబ్లమ్ కాగా ఇప్పుడు విలన్ ఎంపిక ఓ సమస్యగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అన్ని భాషల్లో తెలిసే హీరో ని పెట్టాలని చిత్ర బృందం భావించగా పలువురిని పరిశీలించి వారిని ఎదో ఒక కారణం తో వద్దని చెప్తుంది.. దాంతో ఈ సినిమా కి విలన్ ని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది..