సినిమా వాళ్లంటే అందరికీ ఆసక్తి. క్రేజ్ ఉన్నవాళ్లంటే మరింత ఆసక్తి. జనంలో ఉన్న ఈ ఆసక్తే  సినిమా వ్యక్తులు ఎప్పుడూ వార్తల్లో  ఉండే విధంగా చూస్తుంది. ఇక విషయానికి వస్తే నందమూరి వంశానికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాళ్లకు సంబంధించిన ప్రతీ వార్త సంచలనంగా మారిపోతుంది.  నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి నటిస్తుందనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో దాదాపుగా 25 సెకన్ల పాటు సాగే దృశ్యంలో లక్ష్మీ ప్రణతి కనిపిస్తుందనే వార్త అందర్నీ ఆకర్షిస్తుంది. నందమూరి కోడలు లక్ష్మీ ప్రణతి సినిమాలో కనిపించడం నిజంగా సంచలనం సృష్టించే వార్తే. మరి వార్త నిజమో కాదో... చిత్ర యూనిట్ నుంచి ఖరారు కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: