ముంబైలో ఇఫా అవార్డ్స్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. పలు సినిమాల్లో బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ చేసిన నటీనటులకు అవార్డులు బహుకరించారు. 2019 సంవత్సరానికి గాను ఉత్తమం చిత్రంగా రాజీ సినిమా ఎంపికైంది. ఉత్తమ నటిగా ఆలియాభట్...బెస్ట్ యాక్టర్‌గా రణ్‌వీర్‌ సింగ్  సెలెక్ట్ అయ్యారు. 


ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ప్రతీ ఏడాది హిందీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఐఫా అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఈ అవార్డు ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈసారి రాజీ సినిమాలోని నటనకు గాను ఆలియా భట్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డు గెలుచుకున్న ఆలియాభట్ వేదికపై తన ఆనందాన్ని వెల్లడించింది.


ఇక పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖీల్జీగా నటించిన రణ్‌వీర్ సింగ్ బెస్ట్ యాక్టర్‌గా ఎంపికయ్యారు. 'పద్మావత్' సినిమాలో ఆయన చూపిన అభినయానికి గాను రణవీర్ సింగ్‌ను ఐఫా అవార్డు వరించింది. అంధాధూన్' సినిమా దర్శకుడు శ్రీరాం రాఘవన్‌కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఐఫా అవార్డు లభించింది.


మరోవైపు... ఐఫా బెస్ట్ డిబట్ మేల్ అవార్డు ఇషాన్ ఖట్టర్‌‌కి దక్కించుకున్నాడు. బెస్ట్ డిబట్ ఫిమేల్ అవార్డు సారా అలీఖాన్‌కి దక్కింది. ధడక్ సినిమాలో నటనకు గాను ఇషాన్ ఖట్టర్‌‌, కేదార్‌నాథ్' సినిమాలో నటనకు గాను సారా అలీఖాన్‌ ఈ అవార్డులు అందుకున్నారు. ఇక ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా రాజీ' సినిమా ఎంపికైంది. ఈ చిత్రంలో ఆలియా భట్, విక్కీ కౌశల్ వండర్‌ఫుల్‌గా నటించారు.


సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు ప్రోత్సాహకంగా ఐఫా అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ పేరిట ఇస్తున్న ఈ అవార్డుల ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఐఫా అవార్డ్స్ 2019 వేడుక సందడిగా సాగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటీనటులు, డ్యాన్సర్ల డ్యాన్సులతో ఐఫా అవార్డ్స్ వేదిక హోరెత్తింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: