
హాస్య నటుడు, నిర్మాత గౌతంరాజు ఈ నెల 18న విడుదల కానున్న ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్రంలో విలన్ ఎవరో తొలి రోజు మార్నింగ్‌షో ఇంటర్వెల్‌లో చెప్తే ప్రేక్షకుడికి రూ.50 వేలు పారితోషికం అందజేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. అయితే వారి సినిమే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ నిన్న సింహాచల వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
ఈ నేపథ్యంలోనే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పీజీఆర్ ఫిలిమ్స్ టీవీ ఇనిస్టిట్యూట్ బ్యానర్‌పై తాను స్వయంగా నిర్మాతగా మారి శ్రీనాథ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ సినిమా నిర్మించినట్టు అయన చెప్పారు. అయితే ఆ సినిమా యువతకు నచ్చే విధంగా ప్రేమ కథ ప్రధానంగా సినిమా ఉంటుందని అన్నారు.
కాగా ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు దోచుకునే విధంగా చివరకు సస్పెన్స్ తో కొనసాగుతుందని అయన అన్నారు. అయితే ప్రేక్షకుల తొలిరోజు మార్నింగ్ షో సినిమాకు వెళ్లి ఇంటర్వెల్ లో విలన్ ఎవరో ఉహించి సినిమా టికెట్టుపై రాసి ఆ టికెట్ ఫోటోని 73375 53966 నంబరుకు వాట్సాప్ చెయ్యాలని సూచించారు. మరి ఈ సినిమా నిర్మాత ఇచ్చిన బంఫర్ ఆఫర్ ఎవరు అందుకుంటారో చూడాలి.
కాగా గౌతంరాజు ఈ మధ్యనే సినిమాలోకి మళ్ళి రీఏంట్రీ ఇచ్చారు. ఇటీవలే విడుదలైన వాల్మీకి 'గద్దలకొండ గణేష్' సినిమాలో నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. సినిమాలోను, హీరో సందీప్ కిషన్ సినిమా 'తెనాలి రామలింగడు' సినిమాలో నటిస్తున్నారు. మరి గౌతమ్ రాజు నిర్మించిన సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.