ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మా అసోసియేషన్ ముందు ధర్నా చేసిన శ్రీరెడ్డి, వారి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆ తరువాత అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయడానికి సిద్ధం అయింది. ఆ సమయంలో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ సంఘం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తరువాత కొంత తగ్గి దిగి వచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారు, ఆమెను మళ్ళి సినిమా నటుల సంఘంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాక కొత్తగా సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు పూర్తిగా భద్రతను అందించే విధంగా ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అని తెల్పడం జరిగింది. కాగా ఆ ఘటనతో ఎంతో పాపులరైన శ్రీరెడ్డి, అంతటితో ఆగకుండా, తనను కూడా కొందరు సినిమా నటులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని బహిరంగంగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాక కొందరు సినిమా నటుల పేర్లు కూడా ఆమె బయట పెట్టింది. 

ఇక ఒకానొక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంతో, ఆయన ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఆ వివాదం చాలా రోజుల పాటు కొనసాగింది. ఆ విధంగా శ్రీరెడ్డి పేరు బాగానే మారుమ్రోగింది. అయితే ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మరికొందరు నటులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి, కొద్దిరోజుల క్రితం తన మకాంని పూర్తిగా చెన్నైకి మార్చింది. అలానే అక్కడి మీడియా ఛానల్స్ లో ఇంటర్వూస్ కూడా ఇస్తూ వస్తోంది. అయితే నిన్న ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ లో కన్నడ నటుడు ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు చేసినట్లు పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. 

కాగా వాటిపై నేడు మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి, అటువంటి వార్తలు పూర్తిగా అవాస్తవం అని, అది తన అకౌంట్ కాదని, వేరొకరు తన పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ పెట్టి ఆ విధంగా స్టాలిన్ గారి గురించి తప్పుగా రాసారని చెప్పుకొచ్చింది. అంతేకాక తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నానని, తనకి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉందని శ్రీరెడ్డి చెప్పడం జరిగింది. ఇక అతి త్వరలో తాను చేరబోయే రాజకీయ పార్టీ వివరాలను మీడియాకు చెప్తానని శ్రీరెడ్డి చెప్పింది. అయితే అక్కడి మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె డీఎంకే పార్టీలో చేరే అవకాశాలు గట్టిగా ఉన్నట్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: