సినిమా రంగాన్ని మెగాస్టార్ చిరంజీవి దాదాపు 30 సంవత్సరాల పాటు తిరుగులేని హీరోగా శాసించడం జరిగింది. అయితే 2009వ సంవత్సరం ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి పాలిటిక్స్ లో అడుగు పెట్టారు చిరంజీవి. ఆ సమయంలో తిరుపతిలో ప్రారంభించిన పార్టీకి జనం భయంకరంగా రావడంతో ఖచ్చితంగా 2009 ముఖ్యమంత్రి చిరంజీవి అవుతారని అందరూ భావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18 స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి తిరుపతిలో మాత్రమే గెలవడం జరిగింది. సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో దారుణంగా ఓ అమ్మాయి చేతిలో చిరంజీవి ఓడిపోవడం అప్పట్లో హైలెట్ అయ్యింది.

 

అయితే ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందటం ఆ సమయంలో పడిపోయే కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. దీంతో చిరంజీవి పాలిటిక్స్ లో అడుగు పెట్టి తన కెరియర్ మొత్తాన్ని అట్టర్ ప్లాప్ చేసుకున్నారని మెగా అభిమానులు కామెంట్లు చేయడం జరిగింది. కాగా తాజాగా చిరంజీవి కంటే సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎక్కువ అట్టర్ ఫ్లాప్ అయినా వ్యక్తి పేరు ఇటీవల గట్టిగా వినబడుతోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు విజయశాంతి. చిరంజీవి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ముందుగా టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా రాణించింది.

 

సరిగ్గా తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతి... పార్టీలో సరైన గౌరవం ఇప్పటికీ దక్కించుకోలేకపోయింది.  కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయశాంతి ఉపయోగించుకోవడం జరిగింది. అయినా గాని పార్టీకి పెద్దగా ప్రయోజనం దక్కిన దాఖలాలు లేవు. దీంతో సినిమాల నుండి చిరంజీవి కంటే ముందే వచ్చిన విజయశాంతి కూడా చిరు కంటే ఎక్కువ అట్టర్ ప్లాప్ అయినట్లు రాజకీయవిశ్లేషకులు ఇటీవల విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: