సినీ ప్రపంచం అదొక రంగుల లోకం. ఎంతోమంది కలల ప్రపంచం. ఒక్క అవకాశం కోసం ఎంతోమంది వేచి చూస్తుంటారు. సినిమా కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి రంగుల ప్రపంచం గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా హీరోయిన్స్ గురించి చెప్పుకోవాలి. ప్రేక్షకులు ఎప్పుడు హీరోయిన్స్ అందాన్ని ఏ చూస్తారు. అలాగే దర్శక ,నిర్మాతలు కూడా అంతే. సినిమాలో అందమైన హీరోయిన్ ఉందా లేదా కుర్రకారు ని ఆకట్టుకుందా లేదా అని చూస్తుంటారు. కానీ వాళ్ళు పడే కష్టాన్ని ఎవరు గుర్తించరు.

 

హీరోయిన్స్ సినిమాలోకి రావాలి అంటే చాలా దైర్యం ఉండాలి, చెప్పాలి అంటే ఆత్మాభిమానం చంపుకోవాలి. ఎన్నో అవమానాలు పడాలి. కానీ ఎవరికీ ఇవి తెలీదు. వాళ్లు ఎక్సపోజ్ చేస్తే నే కదా మేము చూసేది అంటారు. కానీ వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళకి సంపాదన వాళ్ళు దానిమీద బ్రతికేది. సరే ఇవ్వని వదిలేద్దాం. అసలు హీరోయిన్స్ కి సినిమాలో ఎంతవరకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. తెలుగు సినిమా విషయానికి వస్తే ఒక ఆరు పాటల్లో హీరో పక్కన డాన్స్ చేయడానికి ,అప్పుడప్పుడు రెండు ,మూడు డైలాగులు చెప్పడానికి ఉపయోగిస్తున్నారు. 

 

హీరోయిన్స్ వాళ్ళకి  టాలెంట్ ఉంది కానీ ఉపయోగించుకోరు. అందుకు ఉదాహరణ అనుష్క. అనుష్క లేడి  ఓరియెంటెడ్ గా వచ్చినా అరుంధతి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెల్సిందే. ఆ తర్వాత అలాంటి జోనర్ లో రెండు ,మూడు వచ్చిన పెద్దగా ఆకొట్టుకోలేదు. లేడి ఓరియెంటెడ్ అంటే అనుష్క అనే ముద్ర వేశారు. మిగతా హీరోయిన్స్ ని గ్లామరస్ పాత్రలకి అంకితం చేసారు. మిగతా హీరోయిన్స్ కి కూడా అవకాశం ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ తెలిసేది. ఇప్పటికి అయినా దర్శక ,నిర్మాతల ఆలోచనలు మారాలి. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఏంటో నిరూపించుకుంటారు. ఇప్పటికి అయినా హీరోయిన్ అంటే ప్రేక్షక పాత్ర అని  మర్చిపోతే బావుంటది అని ఆశిద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: